- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Seethakka : మంత్రి సీతక్క నిరాడంబరత.. తోట పక్కన కూరగాయలు కొనుగోలు
మంత్రి సీతక్క(Minister Seethakka) నిరాడంబరత గురించి తెలియని వారుండరు.

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి సీతక్క(Minister Seethakka) నిరాడంబరత గురించి తెలియని వారుండరు. రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి పదవి చేపట్టినప్పటికీ తాను పుట్టి పెరిగిన నేపథ్యాన్ని గుర్తెరిగి, ప్రజలతో ఇట్టే కలిసి పోతుంది. తనకోసం వచ్చే అతి సామాన్య ప్రజలను, ఆపదలో ఉన్నవారిని, పేదవాళ్ళను, బలహీనులను, మహిళలను అక్కున చేర్చుకుంటుంది. అయితే తాను మంత్రినే కాదు, ఓ సామాన్య గృహిణిలా ఎక్కడ తాజా కూరగాయలు, పండ్లు కనిపించినా వెంటనే కొనేస్తానని మరోసారి నిరూపించింది సీతక్క. అయితే నేడు 'యాంటీ డ్రగ్స్ డే'(Anty Drug Day) సందర్భంగా ములుగులోని ఓ సంక్షేమ స్కూల్లో జరిగే కార్యక్రమానికి వెళుతూ.. స్వయంగా తమ తోటలో పండించి, రోడ్డు పక్కన అమ్ముతున్న ఓ మహిళ వద్ద కూరగాయలు కొనుగోలు చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో తన X ఖాతాలో షేర్ చేస్తూ.. 'ప్రకృతి మన ఆరోగ్యానికి అవసరమైన ప్రతిదీ ఇస్తుంది. సేంద్రీయ పండ్లు, కూరగాయలు(Organic fruits, vegetables), ధాన్యాలను ఎంచుకోవడం ద్వారా దృఢమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు పొందవచ్చు. ఇవి రసాయనాలు లేకుండా సహజంగా పెరుగుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే పర్యావరణాన్ని కాపాడతాయి" అంటూ మంత్రి సీతక్క రాసుకొచ్చారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






