- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవలం ఒక్క శాఖకే పరిమితం కావొద్దు: మంత్రి సీతక్క కీలక ఆదేశం
రాష్ట్రంలో మహిళల సమగ్ర అభివృద్ధి, భద్రత మరియు ఆర్థిక సాధికారత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళల సమగ్ర అభివృద్ధి, భద్రత మరియు ఆర్థిక సాధికారత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క(Minister Seethakka) సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం కేవలం ఒక్క శాఖకే పరిమితం కాకుండా.. విద్య, ఆరోగ్యం, పోలీస్, అటవీ, పంచాయతీరాజ్, మరియు మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక ఉప-కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిన్నతనం నుంచే పిల్లల్లో లింగ సమానత్వంపై అవగాహన కల్పించేలా పాఠశాల పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. 'ఇందిరా మహిళా శక్తి' పథకం ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేయడం, వారికి బ్యాంక్ లింకేజీలు కల్పించడం మరియు సూక్ష్మ వ్యాపారాల్లో ప్రోత్సహించడంపై చర్చించారు. 2047 నాటికి మహిళల పనితీరు భాగస్వామ్యాన్నిపెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.






