- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా దినోత్సవం వేళ మంత్రి సీతక్క కీలక పిలుపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్-2025(Run for Action-2025) ను మంత్రి సీతక్క ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్-2025(Run for Action-2025) ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం పరుగులో గెలిచిన వారికి బహుమతుల అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు మంచి ధైర్యం ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు పోలీసులను అభినందించారు. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అందరూ మానసికంగా, శారీరకంగా అందరూ ధృడంగా ఉండాలని సూచించారు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం సమానత్వమని చెప్పారు.
‘మహిళలకి పురుషులకి మధ్య తేడా ఏమీ లేదు. అందరూ సమానమే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల కోసం ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారు ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణం పోలీసులు. ఎప్పుడూ పోలీసులపైనే ఆధారపడకుండా.. ప్రతి మగవాడు ప్రతి మహిళను తమ ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా చూస్తే మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతారు. ఇటీవలి కాలంలో మత్తు మన జీవితాలను చిత్తు చేస్తుంది. మన గౌరవాన్ని తగ్గిస్తుంది. మాదకద్రవ్యాల నుంచి ఈ సమాజాన్ని చైతన్యవంతంగా మార్చాలి. మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళలను ఎదగనిద్దాం.. మహిళలను గౌరవిద్దాం.. మహిళలను ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగనిద్దాం’ అని సీతక్క పిలుపునిచ్చారు.






