- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటిసారి కామారెడ్డికి మంత్రి సీతక్క రాక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మొట్టమొదటి సారిగా మంగళవారం కామారెడ్డికి వస్తున్నారు

X
దిశ, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మొట్టమొదటి సారిగా మంగళవారం కామారెడ్డికి వస్తున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగే వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడినుంచి 10:45 గంటలకు కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు, ఎరువుల సరఫరా, ఆయిల్ ఫార్మింగ్ పురోగతి, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లో నిర్వహించనున్న మహిళా సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఈమేరకు అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించి ప్రకటన విడుదల చేసారు.
Next Story






