- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ జిల్లాలో ఊటీ, కొడైకెనాల్‌కు మించిన అందాలు: మంత్రి సీతక్క
ములుగు జిల్లా ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ములుగు జిల్లా ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లాలోని అడవులు స్వచ్ఛమైన వాతావరణంతో నిండివుండి, ఊటీ, కొడైకెనాల్‌కు మించిన అందాలను కలిగి ఉన్నాయని తెలిపారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్రజలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ముఖ్యంగా బోగతా జలపాతం, బ్లాక్ బెర్రీ ఐలాండ్, తాడ్వాయి హట్స్, వైల్డ్ సఫారీ వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. కలుషిత నగర ప్రాంతాల కంటే ములుగు జిల్లా అడవుల్లో స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం లభిస్తుందని మంత్రి తెలిపారు. ప్రకృతి ప్రేమికులు, కుటుంబ సమేతంగా విహారయాత్రకు వచ్చే వారికి ఈ ప్రాంతాలు అనువైనవని అన్నారు. ములుగు జిల్లాను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.






