అంగన్‌వాడీ పని తీరు, వంద రోజుల యాక్షన్ ప్లాన్ పై మంత్రి సీతక్క సమీక్ష

by Ajay Maddhiboyina |

అంగన్‌వాడీ పనితీరుపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ గురించి అధికారులతో మాట్లాడారు. అంగన్‌వాడీ సేవలను మరింత మెరుగుపర్చాలని,

అంగన్‌వాడీ పని తీరు, వంద రోజుల యాక్షన్ ప్లాన్ పై మంత్రి సీతక్క సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ పనితీరుపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ గురించి అధికారులతో మాట్లాడారు. అంగన్‌వాడీ సేవలను మరింత మెరుగుపర్చాలని, పోషకాహార లోప నివారణ కోసం వంద రోజుల ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిద్దేశం చేశారు. ఎన్ని ప‌థ‌కాలు తీసుకువ‌చ్చినా, ఎన్ని ఆలోచ‌న‌లు చేసినా అవి క్రింది స్థాయిలో అమ‌లుకాక‌పోతే ఫ‌లితం ఉండ‌ద‌న్నారు. విద్యార్థుల శ‌రీరానికి త‌గిన పోష‌కాహారాన్ని అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పెర‌గ‌టం, త‌గ్గ‌టం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా పోష‌కాహారం అందించాల‌న్నారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజ‌న‌, జేడీలు, ఆర్జేడీలు హాజ‌ర‌య్యారు.

Next Story