అంగన్వాడిలకు ఫుడ్ గ్యాప్ ఉండొద్దు.. లోపాలు జరిగితే కఠిన చర్యలు.. మంత్రి సీతక్క ఆదేశాలు

by Ramesh Naini |

అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సకాలంలో అందుతున్నాయా , గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలామృతం సరఫరాపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు.

అంగన్వాడిలకు ఫుడ్ గ్యాప్ ఉండొద్దు.. లోపాలు జరిగితే కఠిన చర్యలు.. మంత్రి సీతక్క ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్వాడీ (Anganwadis) కేంద్రాలకు సరుకులు (Goods) సకాలంలో అందుతున్నాయా..?, గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలామృతం సరఫరాపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క (Minister Seethakka) సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. పాల సరఫరా లోపం పై మంత్రి సీరియస్‌గా స్పందించారు. పాలతో సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నివేదిక ప్రకారం పాలు మినహా మిగిలిన వస్తువులన్నీ 98 శాతం పైగా సరఫరా అవుతుండగా, పాలు మాత్రం గత నెలలో 58 శాతం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు. శాఖలో జరుగుతున్న పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. 5 జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు టెండర్లు ఖరారు చేసినట్లు అధికారులు తెలియజేశారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 1261 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్ణయించగా, 1181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి లోపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బల్లలు, సిబ్బంది యూనిఫాంలు, చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.ఈ నెల 19,20 తేదిల్లో మ‌హిళా భ‌ద్రత పై చ‌ర్చించేందుకు రౌండ్ టెబుల్, మ‌హిళా స‌ద‌స్సు నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి సీతక్క ఆదేశాలు జారి చేశారు.

Next Story