మలావత్ పూర్ణ‌కు మంత్రి సీతక్క ఓదార్పు.. విషయం ఏమిటంటే?

by Ramesh Naini |   (  Updated:2025-11-20 12:07:03  IST  )

ప్రముఖ ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ‌ను మంత్రి సీతక్క కలిశారు.

మలావత్ పూర్ణ‌కు మంత్రి సీతక్క ఓదార్పు.. విషయం ఏమిటంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ‌(Malavath Poorna)ను మంత్రి సీతక్క కలిశారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ ఇటీవల కన్నుమూయడంతో ఆమెను సీతక్క పరామర్శించారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. మలావత్ పూర్ణ గ్రామానికి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలతో కలిసి కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క ఓదార్చి ధైర్యం చెప్పారు. కాసేపు మలావత్ పూర్ణతో మంత్రి సీతక్క ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మట్లాడి భరోసా కల్పించారు. కాగా, మలావత్ పూర్ణ 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏడు ఖండాలలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఏకైక భారతీయ మహిళగా నిలిచారు.

Next Story