Seethakka: మేడారం మాస్ట‌ర్ ప్లాన్.. కేంద్ర మంత్రి షేకావత్‌తో మంత్రి సీతక్క భేటీ

by Ramesh Naini |

ములుగు జిల్లాలో ప‌ర్య‌ట‌క అభివృద్దికి ఆర్దిక స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర మంత్రికి సీతక్క విన‌తి ప‌త్రం అందించారు.

Seethakka: మేడారం మాస్ట‌ర్ ప్లాన్.. కేంద్ర మంత్రి షేకావత్‌తో మంత్రి సీతక్క భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర సాంస్కృతిక ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్‌ (Union Minister Gajendra Singh Shekhawat)తో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క (Minister Seethakka) భేటీ అయ్యారు. (Mulugu District) ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు. ములుగు జిల్లాలో ప‌ర్య‌ట‌క అభివృద్దికి ఆర్దిక స‌హ‌కారం అందించాల‌ని విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మేడారం (Medaram) మాస్ట‌ర్ ప్లాన్ పనుల కోసం రూ.25 కోట్ల‌ను మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా మంత్రి సీత‌క్క‌ కేంద్ర మంత్రిని కోరారు. అలాగే మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరు శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య అభివృద్ది కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి షేకావ‌త్‌కు సీతక్క ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Next Story