ఆ బాధ్యత మనమీదే ఉంది.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి సీతక్క కీలక పిలుపు

by Gantepaka Srikanth |

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) నరేందర్ రెడ్డి(Narender Reddy)ని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు.

ఆ బాధ్యత మనమీదే ఉంది.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి సీతక్క కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) నరేందర్ రెడ్డి(Narender Reddy)ని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. సోమవారం సీతక్క కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి(Jeevan Reddy) లాగే పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారని హామీ ఇచ్చారు. కరీంనగర్ రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో.. ఎవరిని చట్టసభల్లోకి పంపించాలో కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే రాష్ట్రంలో 55 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రూ.500 గ్యాస్ సిలిండర్‌ను అమలు చేశామని అన్నారు. విభజించూ పాలించు అనేలా బీజేపీ పాలన ఉందని ఎద్దేవా చేశారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలని నాలుగు జిల్లాల పట్టభద్రులను అభ్యర్థిస్తున్నాని సీతక్క విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections)కు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 27న పోలింగ్‌ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Next Story