- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: నాపై తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావ్.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
తనపై తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు కేటీఆర్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తనపై తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు కేటీఆర్ అంటూ మంత్రి సీతక్క (Minister Seethakka) ఫైర్ అయ్యారు. మంగళవారం ఆమె ములుగు కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె సంగతి ఏందో చూడు కేటీఆర్ (KTR) అంటూ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానండి.. నాతో పెట్టుకుంటే నీకు వచ్చేది ఏం లేదని సీతక్క విమర్శించారు. నీలాగా కుల బలము తన బలము అహంకార బలము నా వద్ద లేదు.. నాకెవరూ లేరు. ఉన్న అన్న కూడా ఉద్యమంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు నేను మంత్రయితే కేటీఆర్ తట్టుకోవట్లేదని విమర్శించారు. ఇంట్లో ఆడబిడ్డను కుట్రలు కుతంత్రాలతో వేధిస్తున్నావు.. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో ఇందిరమ్మ పాలన, ప్రజాస్వామ్య పాలన సాఫీగా సాగుతోందని, ఎలాంటి నిర్బంధాలు లేవని స్పష్టం చేశారు.
ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పక్క నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తావా? అని ప్రశ్నించారు. లక్ష్మీదేవి పేట, చల్వాయి తో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద మీరు గతంలో కేసులు పెట్టి వేధించారు.. చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. మీకు రాజకీయ డ్రామాలు తప్ప.. బాధిత కుటుంబాలను ఆదుకునే సోయి లేదన్నారు. ములుగు నియోజకవర్గంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ పోలీస్ అధికారులు ఉన్నారని, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించే కేటీఆర్‌కు సంస్కారం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ములుగులో కనీసం వేయి ఇండ్లు కట్టించి ఇవ్వలేదు.. మీకు మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు.






