మాగంటి గోపీనాథ్ తల్లికి అవమానం.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాగంటి గోపీనాథ్ తల్లికి అవమానం.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే బీఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని మండిపడ్డారు. మాగంటి తల్లి ఆరోపణలపై కేసీఆర్(KCR) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళలు కేటీఆర్ తీరును గమనించాలని కోరారు. హరీష్ రావు నిశ్శబ్ధ విప్లవం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవం అన్నారు. ఆ నిశ్శబ్ధ విప్లవం మిమ్మల్ని నిండా ముంచిందని సీతక్క విమర్శించారు. నిన్నటి వరకు విషాదంలో ఉన్న హరీష్ రావు ఈరోజు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే 24 గంటలు గడవకముందే హరీష్ రావు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో మీరు విధ్వంసం చేశారు.. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.. పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కేసీఆర్‌ది.. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే.. ఆ కబ్జాల నుంచి మేము భూములను విడిపిస్తున్నాం.. హైదరాబాద్ నిండా ముంచింది మీరు.. మీ పదేళ్ల పాలనలో హైదరాబాదులో కనీస మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు.

Next Story