కరాచీ బేకరీలు భారత బిడ్డలవే.. బీజేపీ చిల్లర పనులు మానుకోవాలి.. మంత్రి సీతక్క ఫైర్

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరీ(Karachi Bakery)పై భజరంగ్‌దళ్ నాయకులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

కరాచీ బేకరీలు భారత బిడ్డలవే.. బీజేపీ చిల్లర పనులు మానుకోవాలి.. మంత్రి సీతక్క ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరీ(Karachi Bakery)పై భజరంగ్‌దళ్ నాయకులు దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడిని మంత్రి సీతక్క(Minister Seethakka) ఖండించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కరాచీ బేకరీలు ఈ దేశ బిడ్డలవి అని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా అనేక ప్రాంతాల్లో కరాచీ బేకరీలు ఉన్నాయని గుర్తుచేశారు. కరాచీ బేకరీలపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే చిల్లర పనులు బీజేపీ మానుకోవాలని సీతక్క హితవు పలికారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య యుద్ధం జరుగుతోన్న వేళ పాక్‌కు సంబంధించిన వ్యాపారాలు ఏవీ ఇక్కడ ఉండొద్దని బీజేపీ, భజరంగ్‌ద‌ళ్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ కరాచీ బేకరీలపై దాడులకు పాల్పడుతున్నారు.

Next Story