ఒకప్పుడు అవమానాలు.. ఇప్పుడు అపూర్వ గౌరవం

by Ajay Maddhiboyina |

ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న ట్రాన్స్ జెండర్లు.. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అపూర్వ గౌరవాన్ని అందుకుంటున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

ఒకప్పుడు అవమానాలు.. ఇప్పుడు అపూర్వ గౌరవం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్న ట్రాన్స్ జెండర్లు.. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అపూర్వ గౌరవాన్ని అందుకుంటున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి ఒక్కరిలో సమర్థత ఉంటుందన్నడానికి గొప్ప ఉదాహరణగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ట్రాన్స్ జెండర్లుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించాని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజస్తాన్ ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని అన్నారు. తెలంగాణ మోడల్ ఆదర్శంగా.. ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి.. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్ లను నియమించేందుకు ముందుకు వస్తున్నాయని, దీంతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ జెండర్ లతో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశం అయ్యారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, వృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్సెంటర్ల శాఖ జాయింట్ డైరెక్టర్ శైలజ, ప్రముఖ రచయిత్రి, మహిళా హక్కుల నేత కొండవీటి సత్యవతి, ప్రజ్వల ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు తమ సత్తాను చాటుతున్నారన్నారు. పోలీస్ శాఖ లోనే కాకుండా ఇతర శాఖలోనూ ట్రాన్స్ జెండర్లలను నియమించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం ఇచ్చే అవకాశాలను ట్రాన్స్​జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ విధుల్లో ప్రయోగాత్మకంగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమకం విజయవంతమైందన్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లు కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని.. తోటి ట్రాన్స్ జెండర్ లలో నమ్మకం కలిగించాలన్నారు. ప్రభుత్వ చేయూతను అందుకునేలా వారిని ప్రోత్సహించాలని, ట్రాన్స్ జెండర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం త్వరలో మరిన్ని మైత్రి క్లినిక్లను ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వివరించారు. మంత్రి సీతక్కకు ప్రభుత్వానికి ట్రాఫిక్ అసిస్టెంట్లు ధన్యవాదాలు తెలిపారు.

Next Story