- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో జాప్యం వద్దు: మంత్రి సీతక్క
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణ పురోగతిని తానే స్వయంగా ప్రతిరోజూ పర్యవేక్షిస్తానని, అవసరమైతే రోజువారీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న సీతక్క.. అక్కడి నుంచే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇవి కేవలం భవనాలు మాత్రమే కావని, మహిళల ఆత్మగౌరవానికి నిలువుటద్దాలని అభివర్ణించారు.
వీటి నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి మండలంలో ఎంపీడీవోలు ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఉండి, గ్రామాల్లో భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ నాణ్యతను, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మహిళా భవనాల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపైనా ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, అధికారులు పాల్గొన్నారు.






