- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: స్థానిక సంస్థల ఎన్నికలపై నేనేం మాట మార్చలే.. పీసీసీ సీరియస్ నేపథ్యంలో మంత్రి సీతక్క రియాక్ట్
లోకల్ బాడీ ఎన్నికల విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలపై పీసీసీ చీఫ్ సీరియస్ అయిన నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పాను.. ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదని మంత్రి సీతక్క (Minister Sitakka) క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం లేకుండానే మంత్రులు ప్రకటన చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ (PCC Chief Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన మాటలను వక్రీకరించారని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని నేను ఎక్కడా చెప్పలేదని స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానన్నారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. నాకు జ్ఞానం ఉందని కేబినెట్ లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని అన్నారు. ఎట్లాగు అడవి బిడ్డలం కాబట్టి మా విషయంలో మీడియాలో ఏది పడితే అది రాయడం తనను ఆవేదనకు గురి చేస్తోందని అన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్తున్నాయని గ్రహించే అదే రోజు నేను వివరణ కూడా ఇచ్చాననని చెప్పారు.
మాట మార్చలేదు:
నేను మాట మార్చలేదని మాట మార్చింది నిజమే అయితే ఆ వీడియోను బయటపెట్టాలన్నారు. నేను తప్పు మాట్లాడలేదని ఇప్పుడు తప్పించుకోవడం లేదన్నారు. వందలాది మంది కార్యకర్తలు ఉన్న కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఎప్పుడు ఉంటాయో వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానని నోటిఫికేషన్ పై ఎక్కడా మాట్లాడలేదన్నారు. సీతక్కపై తప్పుడు వార్తలు రాసే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మా ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేన్లపై ఎలా ముందకు వెళ్లాలో ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నానన్నారు.
కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలం:
జైలుకు వెళ్లాలని కేటీఆర్ కే కుతూహలంగా ఉన్నట్లు ఉందని మంత్రి సీతక్క సెటైర్ వేశారు. కవిత జైలుకు వెళ్లిరాగానే బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చట్టప్రకారమే వెళ్తుందని ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు.






