- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka: బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్.. మంత్రి సీతక్క సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్రంలో బీజేపీ (BJP)కి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ‘బీ’ టీమ్‌గా పని చేస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీజేపీ (BJP)కి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ‘బీ’ టీమ్‌గా పని చేస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్ (Praja Bhavan)లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమవేశానికి బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతలు గైర్హాజరు అవ్వడం పట్ల ఆమె ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అందుకే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) నిలదీయాలని పిలుపునిస్తే బీఆర్ఎస్ (BRS)) తమతో కలిసి రావడం లేదని అన్నారు. ఇక్కడే మరోసారి ఆ పార్టీల బంధం బయటపడిందని కామెంట్ చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాలే బీఆర్ఎస్ (BRS) నేతల లక్ష్యమని.. రాష్ట్ర అభివృద్ధి ఆ పార్టీ నేతలకు అక్కర్లేదని ధ్వజమెత్తారు. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని రెండు పార్టీల నేతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఆహ్వానించినా రాకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్ల అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. నేడు తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే వారికి కడుపు మంటగా ఉందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.






