- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క.. అసలు విషయం ఇదే!
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మంత్రి సీతక్క (Minister Seethakka) ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మంత్రి సీతక్క (Minister Seethakka) ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అయితే 2021, ఆగస్టు 26న కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ (Aarogya Sri)లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి ఆమె ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌కు చికిత్స అందజేయాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ (CMRF) కింద చెల్లించాలని కోరారు. కానీ, కోవిడ్ సమయంలో గుంపులుగా బయట తిరగొద్దని నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నా.. ఆమరణ దీక్షలో పాల్గొన్నందుకు సీతక్కపై నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు విచారణలో భాగంగా ఇవాళ సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.






