Ministers: సమస్యలను పెండింగ్‌లో ఉంచొద్దు.. ఎప్పటికప్పుడు మాకు చెప్పండి

by Gantepaka Srikanth |

ములుగు జిల్లాలోని అటవీశాఖ(Forest Department) సంబంధిత సమస్యలపై మంత్రులు సురేఖ(Konda Surekha), సీతక్క(Minister Seethakka) దృష్టి సారించారు.

Ministers: సమస్యలను పెండింగ్‌లో ఉంచొద్దు.. ఎప్పటికప్పుడు మాకు చెప్పండి
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలోని అటవీశాఖ(Forest Department) సంబంధిత సమస్యలపై మంత్రులు సురేఖ(Konda Surekha), సీతక్క(Minister Seethakka) దృష్టి సారించారు. ములుగు జిల్లాలో రోడ్ల నిర్మాణం, కరెంటు స్థంభాలకి సంబంధించి అటవీ అనుమతుల విష‌యంలో ఏర్పడిన ఇబ్బందులపై సంబంధిత మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) మంత్రి సీతక్కల నేతృత్వంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో పీసీసీఫ్(PCCF), డీఎఫ్ఓ(DFO) ఇత‌ర అట‌వీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల నిర్మాణం, ఎల‌క్ట్రిక్ స్థంభాలకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే ఎప్పటిక‌ప్పుడు తమ దృష్టికి తీసుకొచ్చి స‌మ‌స్యల‌ ప‌రిష్కారం దిశ‌గా వేగంగా అడుగులు వేయాల‌ని సూచించారు. పనుల నిర్మాణానికి సంబంధించి తరచూ నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు సురేఖ, సీతక్క ఆదేశించారు.

Next Story