- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seetakka: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
మహిళా స్వయం సహాయక సంఘాల విషయంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను (Women Self Help Groups) ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క (Seethakka) చెప్పారు. మహిళా సాధికారతకు సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై ఇవాళ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంచి సీతక్క సమాధానం ఇస్తూ మాట్లాడారు. ప్రతి మహిళ ఎస్‍జీహెచ్ సభ్యురాలుగా ఉండాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి పండు ముసలి వరకు మహిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని భావించామని అయితే ఉత్పత్తిలో జరిగిన ఆలస్యం వల్ల పట్టణ ప్రాంతంలో పంపిణీ ఆగిందన్నారు. ఆసుపత్రులు, కాలేజీలు, ఆలయాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు ముందుకు వస్తే వారికి క్యాంటీన్ ఏర్పాటు లేదా పాల బూత్, కిరాణ షాపులు పెట్టుకునేందుకు ప్రభుత్వం తరఫున మద్దతు, సహకారం ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు.
త్వరలో యాదగిరిగుట్ట వద్ద క్యాంటీన్:
తెలంగాణలో ఎక్కువ మంది దర్శించుకునే యాదగిరిగుట్ట వద్ద మహిళా సంఘాల చేత క్యాంటీన్ తో పాటు ఇతర దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తామని సీతక్క వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు.
Read More..
ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే రైతులే మరమ్మత్తులకు తీసుకెళ్తున్నారు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం






