దమ్ముంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేయండి.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-05 15:23:05  IST  )

మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

దమ్ముంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేయండి.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్
X

దిశ‌, వెబ్ డెస్క్: మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్టేజిపై కూర్చుకున్నారు. దీంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తగా అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని 1700 రేషన్ కార్డులు ఇచ్చి ఇంత డబ్బా కొట్టుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే పోలీసులను పెట్టుకుని కార్యక్రమాలు చేకడమా అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నారా లేదా ప్రభుత్వం తరఫున ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏదో గాంధీ భవన్‌లో నిర్వహించే రాజకీయ కార్యక్రమంలా అర్హత లేని వ్యక్తులను స్టేజిపై ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించారు. కేవలం లబ్ధి దారులకు నష్టం జరగొద్దనే మౌనంగా బయటకు వచ్చానని అన్నారు.

Next Story