జిల్లా నేతల సమీక్షకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దూరం

by Disha Web |
జిల్లా నేతల సమీక్షకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దూరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లా నేతల సమీక్షకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గైర్హాజర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో ఆత్మీయ సమ్మేళనాలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా హాజరైనప్పటికీ మంత్రి రాలేదు. అందరూ రావాలని సూచించి ఆమె రాకపోవడంతో ఎమ్మెల్యేలు కొంత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 నాటికి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులతోపాటు జిల్లాలో నేతల సమన్వయం కోసం ఇన్ చార్జులను పార్టీ నియమించడంతో జిల్లాల్లో సమ్మేళనాల విజయవంతానికి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగానే శనివారం తెలంగాణ భవన్ లో ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో సమ్మేళనాలపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెలంతా హాజరైనప్పటికీ మంత్రి సబితా గైర్హాజర్ అయ్యారు. బీఆర్కే భవన్ లో మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ కు హాజరయ్యారు. జిల్లా సమావేశానికి దూరంగా ఉండటంతో సమ్మేళనాలపై చర్చించే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఎమ్మెల్యేలు కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.Next Story