- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరే ఖమ్మంలో బీఆర్ఎస్‌ను 9 స్థానాల్లో ఓడించారు: మంత్రి పువ్వాడ ఫైర్
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సోమవారం

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి పువ్వాడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ అవకాశవాది ఐదేళ్లకో పార్టీ మారస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ను ఆయన మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడి ఇంట్లో కూర్చున్న వ్యక్తికి సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి ఇప్పుడు కలిసిన ఆ ఇద్దరే గతంలో కత్తులు దూసుకుని ఖమ్మంలో 9 స్థానాల్లో పార్టీని ఓడించారని పరోక్షంగా తుమ్మల, పొంగులేటీపై ఫైర్ అయ్యారు. ఓడినా.. గెలిచినా.. మేం మాత్రం ఖమ్మంనే నమ్ముకున్నామని అన్నారు.
Next Story






