Minister Prabhakar: నా మీద కూడా కేసులున్నాయ్.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-11 05:33:55  IST  )

తన మీద కూడా చాలా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Minister Prabhakar: నా మీద కూడా కేసులున్నాయ్.. మంత్రి పొన్నం సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తన మీద కూడా చాలా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా చేయూతను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం మెప్మా (MEPMA) ద్వారా మహిళలకు సాయం అందజేస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాల సమస్యలను మార్చి తరువాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ (Husnabad) ఎల్లమ్మ చెరువు (Yellamma Cheruvu) కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. గౌరవెల్లి (Gowrelli), మిడ్ మానేరు Mid Maaneru), మల్లన్న సాగర్‌ (Mallanna Sagar)లకు సంబంధించి స్థానికులపై ఉన్న కేసులు ఎత్తివేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతానని అన్నారు. సీఎంతో పాటు తన మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Next Story