- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam: భారీ వర్షాలు.. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ పై మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్ లో వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా అన్ని విభాగాల అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. గత వారం నగరంలో కురిసిన వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచనలు చేశారు.






