- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు మరో మైలురాయి
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. 25 మంది విద్యార్థులు ఐఐఐటీ కాలేజీల్లో చేరేందుకు అర్హత సాధించగా, మరో ఐదుగురు విద్యార్థులు జేఈఈ మెయిన్-2026 ఫలితాల్లో ర్యాంకులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన ఈ విజయం వారి కృషికి, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమని నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో బీసీ గురుకులాలు పనిచేస్తున్నాయని, విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం సంతోషకరమని తెలిపారు.






