Minister Ponnam : కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం వార్నింగ్ !

by Y. Venkata Narasimha Reddy |

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi)పై నోరుపారేసుకుంటే(Inappropriate Comments) సహించేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)హెచ్చరించారు.

Minister Ponnam : కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం వార్నింగ్ !
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi)పై నోరుపారేసుకుంటే(Inappropriate Comments) సహించేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో చూస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఎలా ఇవ్వరో మేము చూస్తామన్నారు.

ఇందిరను బీజేపీ ప్రధాని అయిన వాజ్ పేయి కాళీమాతతో పొల్చారని గుర్తు చేశారు. 10 నెలల కాలంలో జీఏస్టీ రూపంలో రూ.37 వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందన్నారు. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ , దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు కేంద్రం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా? అని ధ్వజమెత్తారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోరని హెచ్చరించారు.

తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయైనా కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా? అన్న ప్రశ్నకు ముందుగా బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన అసహనానికి కేటీఆర్ పరాకాష్ట అని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుండటాన్ని కేటీఆర్ జీర్ణం కావడం లేదన్నారు. అందుకే ఈనో ప్యాకెట్లు పంపిస్తున్నామని ఎద్దేవా చేశారు.పథకాలకు సంబంధించి కేటీఆర్ తో పాటు ఏ ఊరికి అయిన వచ్చేందుకు సిద్ధమన్నారు. ఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగినా ప్రశ్నించవచ్చన్నారు.

Next Story