Minister Ponnam: ఆ పరిణామం బీసీలకు శుభసూచికం.. మంత్రి పొన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Minister Ponnam: ఆ పరిణామం బీసీలకు శుభసూచికం.. మంత్రి పొన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలి (Legislative Council)కి బలహీనవర్గాలకు చెందిన వారిని పంపడం నిజంగా శుభసూచికమని అన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka)కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కట్టుబడి ఉందనే విషయం మరోసారి నిరూపితమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు.

కాగా, తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ (Addanki Dayakar), విజయశాంతి (Vijaya Shanthi), శంకర్ నాయక్ (Shankar Nayak) పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలం మేరకు కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. అయితే.. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story