- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Ponnam: సన్నబియ్యం ఇచ్చే ఏకైక స్టేట్ తెలంగాణ.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
దేశ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించిందని అన్నారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ దుకాణాల ద్వారా 2.91 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అంతుకు ముందు రైతులను, అధికారులను సన్న బియ్యం పంపిణీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Next Story






