- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేద విద్యార్థికి అండగా మంత్రి పొన్నం
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలో సీటు సంపాదించి, ఫీజులు కట్టే స్థోమత లేని ఓ నిరుపేద విద్యార్థికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) అండగా నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలో సీటు సంపాదించి, ఫీజులు కట్టే స్థోమత లేని ఓ నిరుపేద విద్యార్థికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మార మహేష్ జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 453 ర్యాంకు, ఎస్సీ విభాగంలో 17వ ర్యాంకు సాధించాడు. తిరుచురాపల్లి NIT లోని ఆర్కిటెక్చర్ విభాగంలో సీటు పొందాడు. అయితే కాలేజీ ఫీజులకు, హాస్టల్ ఖర్చులకు లక్షల్లో అవుతుండగా.. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు అంత ఫీజులు భరించలేక ఆవేదన చెందారు. మహేష్ దీన గాథ తెలుసుకున్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతోసహా పలువురు దాతలు ముందుకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మహేష్ చదువుకు అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తానని ముందుకు వచ్చారు. ఈ మేరకు మంత్రి పొన్నం తనం ఎక్స్ ఖాతాలో... విద్య ఎప్పుడూ భారం కాకూడదు. నీ కాలేజీ ఫీజుకు సంబంధించి వ్యక్తిగతంగా నేను పూర్తీ బాధ్యత తీసుకుంటాను. నా టీమ్ త్వరలోనే నిన్ను సంప్రదిస్తుంది. అవసరమైన సహాయం చేస్తుంది.." అంటూ ట్వీట్ చేసారు.






