- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులగణనపై బీజేపీ జాతీయ నాయకత్వం స్టాండ్ ఏంటి? ఎక్స్‌లో మంత్రి పొన్నం ప్రశ్న
కులగణనపై బీజేపీ జాతీయ నాయకత్వం స్టాండ్ ఏంటి? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు చాన్సే లేదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేదర్ అన్నారు. చాలా కులాలు దేశవ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ కింద లేవని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ రెండు స్టేట్‌మెంట్‌లపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం ఎక్స్ వేదికగా బీజేపీ నేతలకు ఒక ప్రశ్న వేశారు. కులగణనపై బీజేపీ జాతీయ నాయకత్వం స్టాండ్ ఏంటి? అని మంత్రి ప్రశ్నించారు. ‘మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒకరు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి అంటే.. మరొకరు దేశవ్యాప్తంగా కులగణనకి ఛాన్స్ లేదు అంటున్నారు.. ఒకే పార్టీలో భిన్న స్వరాలపై బీజేపీ ఎటు వైపు ఉంటుంది?’ అంటూ మంత్రి నిలదీశారు.
Next Story






