- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఎక్కడైనా దించుతాం! విద్యార్థులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్
ఇంటర్, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్టికెట్ ఉంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఎక్కడైనా దిగవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్టికెట్ ఉంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఎక్కడైనా దిగవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆర్టీసీ సేవలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్, ,మార్చి 14 వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల సమయం ఉదయం, మధ్యాహ్నం సమయంలో అదనంగా బస్సులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు పరీక్షల సమీపిస్తుండడంతో విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్షించినట్లు స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద దింపేందుకు చర్యలు
గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్సుల ఆపరేషన్ మరింత కిందిస్థాయి వరకు పంపించడం జరిగిందన్నారు. పరీక్షా సమయంలో బస్సుల హాల్డు స్టాప్ ఉన్నా లేకున్నా బస్సులు నిలిపేలా హాల్ టికెట్ ఆధారంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను దింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి డిపో మేనేజర్ ద్వారా ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఇలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.






