ఈ సమయంలో రాజకీయాలొద్దు.. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం

by Prasad Jukanti |   (  Updated:2025-11-03 09:31:49  IST  )

రోడ్డు విస్తరణ కాకపోవడం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని వస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు.

ఈ సమయంలో రాజకీయాలొద్దు.. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై (Chevella bus accident) విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. ఇవాళ చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటన చూస్తే మా మనసు చలిస్తోందని ఇది చాలా దురదృష్టకర సంఘటన అన్నారు. రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి పొన్నం రోడ్డు విస్తరణకు ఎవరు అడ్డుకున్నారో విచారణలో అన్నీ తెలుస్తాయన్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇది రాజకీయాలకు సమయం కాదన్నారు. ఈ విషయంలో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

READ MORE .....

మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేసు : సీపీ అవినాష్ మొహంతి

Next Story