- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: సుప్రీంకోర్టు తీర్పుతో ‘ఓటు చోరీ’ రుజువైంది
by Gantepaka Srikanth |
సుప్రీంకోర్టు తీర్పుతో ఓట్ చోరీ అంశం రుజువైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు తీర్పుతో ఓట్ చోరీ అంశం రుజువైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు అనే ఆయుధాన్ని అక్రమంగా తొలగించడం, ఓటు వేయకుండా చేయడం, దొంగ ఓట్లతో ఏం జరుగుతుందో దేశ ప్రజలు గమనించాలన్నారు. గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 65 లక్షల తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని, వాటిని తొలగించడానికి గల కారణాలను తెలియజేయాలని, నూతన ఓటరు నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని, అసలు ఓటరు నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారో చెప్పాలని నాలుగు ప్రధాన ప్రశ్నలతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డుతో ఓటు లింక్ చేసి ఒక ఓటు - ఒక మనిషి అనే విధానాన్ని తీసుకురావాలన్న రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ స్పందించాలని మంత్రి పొన్నం అన్నారు.
Next Story






