- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత vs తీన్మార్ మల్లన్న.. మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్
ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) - కల్వకుంట్ల కవిత(Kavitha) మధ్య వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) - కల్వకుంట్ల కవిత(Kavitha) మధ్య వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. సోమవారం గాంధీ భవన్‌లో పొన్నం మీడియాతో మాట్లాడారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేదు. తెలంగాణలో కొన్ని సామెతలు ఉంటే ఉండొచ్చు.. కానీ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. అంతేగాకుండా.. తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద కవిత అనుచరులు కూడా దాడులు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. పోలీసులు ఉన్నారు.. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి.. ఇవన్నీ వదిలేసి నేరుగా దాడులకు పాల్పడటం ఏంటని మండిపడ్డారు. మహిళలను కాంగ్రెస్ పార్టీ అమితంగా గౌరవిస్తుందని అన్నారు.
అనంతరం కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలపై ఉందన్నారు. రాష్ట్రపతితో ఆమోదింపజేసి.. 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చూసిన తర్వాతే కేంద్రం కళ్లు తెరిచింది. రాష్ట్ర ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కులగణనను ప్రకటించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.






