జూబ్లీహిల్స్‌లో బీజేపీకి పడే ఓట్లు ఇవే.. మంత్రి పొన్నం ప్రిడిక్షన్

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్‌తో కుమ్మకై ప్రచార సరళి మొత్తం దింపుడు గళ్లం ఆశలాగా మార్చారని, బీజేపీ వ్యవస్థను అంత బీఆర్ఎస్2కి హ్యాండోవర్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు గుప్పించారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి పడే ఓట్లు ఇవే.. మంత్రి పొన్నం ప్రిడిక్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్‌తో కుమ్మకై ప్రచార సరళి మొత్తం దింపుడు గళ్లం ఆశలాగా మార్చారని, బీజేపీ వ్యవస్థను అంత బీఆర్ఎస్2కి హ్యాండోవర్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు గుప్పించారు. సోమవారం పొన్నం ప్రభాకర్​మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థికి 10 వేల కంటే ఎక్కువ ఓట్లు దాటవని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మీరు గత ఎన్నికల్లో వారి మద్దతు తీసుకొని దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నట్లుగా జూబ్లీహిల్స్‌లో చర్చ జరుగుతోందని పొన్నం ప్రభాకర్​తెలిపారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తన ఎంపీ స్థానంలోని జూబ్లీహిల్స్​నియోజకవర్గానికి ఈ పదేళ్లలో ఏం చేసారో చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైన నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా, నిజాయితిగా పని చేయమని రాజసింగ్ చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నానని పొన్నం ప్రభాకర్​చెప్పారు.

Next Story