- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1,000 కోట్లు బకాయి, కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలి.. రక్షణ శాఖ మంత్రికి మంత్రి పొన్నం లేఖ
కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ చార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : (Cantonment) కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ చార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ మేరకు ఆయన రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్(Defense Minister Rajnath Singh)కు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ సంతకాలతో కూడిన లేఖను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రాశారు. కంటోన్మెంట్ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వలన రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడిచిపెట్టడానికి సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని రక్షణ మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు.
నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ భూ మార్పిడి కీలకంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగడం లేదని మీ దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తుకు చేశారు. ప్రజాస్వామ్య పాలన, స్థానిక ప్రాతినిధ్యం దృష్ట్యా, ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.






