- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ రూల్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి’.. రవాణాశాఖ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
రవాణాశాఖ(Transport Department) అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక జూమ్ సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రవాణాశాఖ(Transport Department) అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక జూమ్ సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణాశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రమాదాలు జరగకుండా రవాణాశాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇవాళ జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అన్నారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతున్నాయో చూడాలి.. దానిని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని ఆదేశించారు.
రవాణాశాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ సీరియస్‌గా, యాక్టీవ్‌గా ఉండాలి.. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు.. నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలి.. రవాణాశాఖ గౌరవాన్ని ప్రజల్లో ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలి. అందరూ ఎఫెక్టివ్‌గా పని చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణాశాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చు అని అన్నారు.
ప్రజలకు వేధింపులు లేకుండా రవాణాశాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి.. రవాణా శాఖలో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పలిన్ కప్పుకొని తీసుకోవాలి.. డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపుకు ఉపయోగించే వాహనాలపై వేధింపులకు గురిచేయొద్దు అని సూచించారు.
కమర్షియల్ వాహనాలు, ప్రయాణికులను తరలించే వాహనాలు, మైన్స్ మినరల్స్ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించని వాహనాల్లో భారీ పెనాల్టీ తో పాటు కఠినచర్యలు తీసుకోవాలి. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు అందులో కార్గో సరుకులు తరలించిన కఠినంగా వ్యవహరించాలి. స్కూల్ బస్ ఫిట్నెస్, హైర్ బస్ ఫిట్నెస్, ట్రక్కులు, టిప్పర్‌లు లారీలు వాటి ఫిట్నెస్ ఫర్మిట్‌లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. దాని కన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.






