- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాగంటి పిల్లలు కూడా రోడ్డు మీదకు వస్తున్నారు.. జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills By-Election)లో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills By-Election)లో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీకి కూడా సానుభూతి ఉందని అన్నారు. కానీ.. సెంటిమెంట్ రాజకీయంతో అభివృద్ధి జరుగదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయాల కోసం.. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. కంటోన్మెంట్ ఓటర్ల చైతన్యం జూబ్లీహిల్స్‌లోనూ రావాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సొంత నేతలకు సూచించారు. నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో 6 వేల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. అధికార పార్టీకి అవకాశమిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.






