- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది: మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation)లో మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా MGBSలో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation)లో మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా MGBSలో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పాల్గొని మాట్లాడారు. 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన డిసెంబర్ 9,2023 ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసనసభ వేదిక మహాలక్ష్మి పథకం ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా వెళ్తున్నారని అన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలు అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు.. ఉద్యోగాలు, దేవాలయాలు, షాపింగ్‌లకు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరినీ చేయి చాచి అడగాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నారు. గత పదేళ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అసలు ఆర్టీసీ ఉంటుందా? అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం.. నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక విధ్వంసం తరువాత.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






