ఆ రాష్ట్రంలా తెలంగాణ కావొద్దంటే.. మీరు సహకరించాలి: మంత్రి పొన్నం

by Gantepaka Srikanth |

ఆ రాష్ట్రంలా తెలంగాణ కావొద్దంటే.. మీరు సహకరించాలి: మంత్రి పొన్నం

ఆ రాష్ట్రంలా తెలంగాణ కావొద్దంటే.. మీరు సహకరించాలి: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దు అనేదే మా తాపత్రయం. అందుకే జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పటివరకు 1,59,304 ఈవీ వాహనాలకు రాయితీ ఇచ్చాం. ఇందుకు రూ.806.35 కోట్ల వరకు ఖర్చు చేశాం. ప్రభుత్వం నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. 2047 నాటికి పూర్తిగా ఈవీ వాహనాలు కావాలనేది మా కోరిక. హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల పెరుగుతున్న కొత్త కాలనీల దృశ్య ప్రభుత్వం జీవో 263 తీసుకొచ్చింది. అందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు, 10 వేల సీఎన్‌జీ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, 25 వేల రెట్రో ఫీటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.

నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరిపడ ఛార్జింగ్ స్టేషన్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని కంపెనీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఉంటుంది.. దానిపై మీరు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. కంపెనీలు, డీలర్లు, ఏజెన్సీలు జనవరిలో జరిగే రోడ్ సేఫ్ మంత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. దీనిపై స్కూల్ చిల్డ్రన్‌కి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈవీ కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలి.. ప్రజలు ఈవీ వాహనాలు ఉపయోగించేలా కంపెనీలు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు.

Next Story