- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొత్తం ఇన్వాల్వ్ అవ్వండి.. కాంగ్రెస్ కేడర్‌కు మంత్రి పొన్నం కీలక పిలుపు
ఆర్టీసీ కార్మికుల సమస్యలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి వారి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమస్యలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి వారి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందుకే ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ మొత్తం ఇన్వాల్వ్ అయి సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులతో మంత్రి పొన్నం జూమ్ సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లన్నీ పరిష్కరించేందుకు అంగీకరించామని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం లో 55 రోజుల సమ్మె చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అప్పుడు 30 మందికి పైగా మరణించారని గుర్తుచేశారు. కార్మికులతో తమకు శతృత్వం లేదని.. వారు తమ కుటుంబ సభ్యుల వంటి వారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
బండి సంజయ్ శవ రాజకీయాలు చేయడం సరైంది కాదని.. సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్‌లు వ్యవహరించిన తీరు మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఆర్టీసీ సమ్మె విరమణ పై ప్రభుత్వ తీసుకున్న చొరవపై కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎజెండాగా తీసుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. మనం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం ప్రజల్లోకి వివరించాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు 2013 బాండ్స్, 2017 పీఆర్సీ, డీఏలు ప్రకటన, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల నియామకాలు, కారుణ్య నియామకాలు, సర్వీసు నుండి తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని... పేద ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కోసం ఆర్టీసీ లైఫ్ లైన్ లాగా పని చేస్తున్నదని తెలిపారు.






