‘ఏ ప్రభుత్వం అయినా బీసీలకు తల వంచాల్సిందే’.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక పిలుపునిచ్చారు.

‘ఏ ప్రభుత్వం అయినా బీసీలకు తల వంచాల్సిందే’.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వెనుకబడిన వారి కోసం రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోరాటం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడగానే తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఏ ప్రభుత్వమైనా తలవంచాల్సిందే అని కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించడం చేతకాకపోతే రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలుకావో చూస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Next Story