- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ఆపత్కాలంలో రాజకీయం చేయకండి: మంత్రి పొన్నం విజ్ఞప్తి
ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున భారీ భరోసాను ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున భారీ భరోసాను ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో జరుగుతున్న కీలక సమావేశం మధ్యలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుడి పార్థివ దేహంతో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, శంకర్ గౌడ్ అంత్యక్రియలు సజావుగా పూర్తి చేసేలా జేఏసీ నేతలు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కుటుంబం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉందని, వారికి సానుకూల వాతావరణం కల్పించాలని కోరారు. ఆపత్కాలంలో ఉన్న కార్మిక కుటుంబాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయవద్దు" అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం మరణాలను వాడుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.
సచివాలయంలో కొనసాగుతున్న ఉత్కంఠ..
మరోవైపు, సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నా, జేఏసీ నేతలు మాత్రం తమ పట్టు వీడటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన హామీలపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్చల అనంతరం సమ్మెపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.






