ఆర్టీసీ బస్సులో మహిళలతో మంత్రి ముచ్చట్లు! లక్డీకపూల్ వరకు ప్రయాణం.. వైరల్

by Ramesh Naini |

గత కొన్ని రోజులుగా టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా సిబ్బంది, ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడం కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ బస్సులో మహిళలతో మంత్రి ముచ్చట్లు! లక్డీకపూల్ వరకు ప్రయాణం.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (TGSRTC) టీజీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా గత కొన్ని రోజులుగా సిబ్బంది, ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడం కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఉన్న వివిధ బస్టాప్‌లను మంత్రి సందర్శిస్తున్నారు. మరోవైపు సిటీలో బస్సు ప్రయాణలు చేస్తూ ప్రయాణికుల సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ సిటీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. (Panjagutta to Lakdikapool) పంజాగుట్ట నుంచి లక్డీకపూల్‌లో హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ (Mayor Gadwal Vijaya Lakshmi), రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌ (Anil Kumar Yadav) తదితరులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టారు. మహిళా ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు డ్రైవర్, కండక్టర్‌తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రజా ప్రతినిధులు ఇలానే ఎప్పుడూ ప్రజల్లో ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తాయని, ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా, ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్ డిపోల్లో (Sanitary Napkin Vending Machines) సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సహేలి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు, హనుమకొండ బస్టాండ్ లో నాప్కిన్ వెండింగ్ మిషన్లను ప్రారంభం కానున్నాయి. నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచన చేసింది.దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్ లో తొలిసారిగా సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెలంగాణ రాష్ట్రం అందుబాటులోకి తెస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఆర్టీసీ ల సహకారంతో పది రోజుల్లో ములుగు, హనుమకొండ బస్టాండ్లలో సానిటరీ నాప్కిన్ మిషన్లను సహేలీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

Next Story