- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప ఆశయంతో ఆ స్కీమ్‌ను కొనసాగిస్తున్నాం: మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజాభవన్‌లో సింగరేణి ఆధ్వర్యంలో మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాభవన్‌లో సింగరేణి ఆధ్వర్యంలో మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో కొంత సాయం చేస్తే వారు లక్ష్యం సాధించేందుకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసినట్లు చెప్పారు. సివిల్స్ సాధించేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అన్నివిధాలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభ్యర్థులకు మనో ధైర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. మెయిన్స్‌కు ఎంపికైన 180 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి సైతం లక్ష ఆర్థిక సాయం, ఢిల్లీలో వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సహాయం అందించగా పది మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారని వివరించారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం(Rajiv Civils Abhaya Hastham Scheme) గొప్ప ఆశయంతో కొనసాగిస్తున్నామని.. ఈ పథకం సహాయంతో సివిల్స్‌లో విజయం సాధించి, పరిపాలన విభాగంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. సివిల్స్‌కు ఎంపికైన తర్వాత కూడా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు నిత్యం శ్రమించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. పేద ఇంటి పిల్లలు కూడా సివిల్స్‌లో విజయం సాధించాలనే ఉద్దేశంతో సీఎం, డిప్యూటీ సీఎం మార్గనిర్దేశంలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.






