- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము మా పార్టీలో కంఫర్ట్‌గా ఉన్నాం.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)పై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)పై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే హక్కు, అర్హత రెండూ కవితకు లేవని విమర్శించారు. తమ పార్టీలోని నేతలంతా సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. మా పార్టీలో మేము చాలా కంఫర్ట్‌గా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాలను ముందు క్లియర్ చేసుకోవాలి.. దమ్ముంటే తన లేఖలు ఎలా బయటకు వచ్చాయో, ఎవరు బయటకు తెచ్చారో కవిత చెప్పాలని హితవు పలికారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ తరహా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసంతో ఆర్థిక చేయూత ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని.. ఆ రెండు పార్టీలతో తెలంగాణను ఎప్పటికీ ప్రమాదమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లేఖ బయటకు రావడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నాయనే వాదన తెర మీదకు వచ్చింది. తాజాగా చేసిన చిట్‌చాట్‌లో కవిత మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లేఖ రాసింది తన తండ్రికే అని.. అది కూడా పార్టీ బలోపేతం కోసమే అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరో వంద లేఖలు రాస్తానని.. కానీ ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియాలని కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.






