- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
బీజేపీ తెలంగాణ(Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ(Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసిందని మండిపడ్డారు. బీసీల వ్యతిరేక పార్టీ అని మరోసారి నిరూపించిందని అన్నారు. బీసీల్లో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ఫ్యూడల్ పార్టీ అని.. ఎప్పుడూ బీసీలకు న్యాయం చేయదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి బీసీ నేత నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గతంలో బీసీ నేత అయిన బండి సంజయ్‌ని తొలగించి.. కిషన్ రెడ్డికి అప్పగించారని గుర్తుచేశారు. దేశంలో సామాజికన్యాయం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. మరోవైపు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు.






