Ponnam Prabhakar: భవిష్యత్తులోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తాం

by Gantepaka Srikanth |

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని, కరీంనగర్‌ను నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam Prabhakar: భవిష్యత్తులోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని, కరీంనగర్‌ను నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జలసౌధలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జిల్లా అభివృద్ధికి సంబంధించి చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎలా ముందుకు తీసుకుపోవాలో సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

ఇరిగేషన్ మంత్రిగా జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యలను, విద్య, వైద్యం, ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా మంత్రులుగా తాను, శ్రీధర్ బాబు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి త్వరలోనే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని తెలిపారు. రైతులకు, ఇతర ప్రజలకు ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులుగా జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు.

Next Story