ఎవరో పోరాటం చేస్తే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాం.. మంత్రి పొన్నం సీరియస్

by Gantepaka Srikanth |

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎవరో పోరాటం చేస్తే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాం.. మంత్రి పొన్నం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నిర్ణయాల మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కేటాయించామని అన్నారు. ఎవరో పోరాటం చేస్తే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటామని మండిపడ్డారు. కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి 42 శాతం రిజర్వేషన్లను కాపాడుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా, బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులంతా మండిపడుతున్నారు.

Next Story